విద్యాదానం చేయగ రండి! ‘గివ్ ఇట్ అప్’ స్ఫూర్తితో నిధుల సేకరణ
విద్యాదానం చేయగ రండి‘
గివ్ ఇట్ అప్’ స్ఫూర్తితోనిధుల సేకరణ
వంటగ్యాస్ సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకునే ‘గివ్ ఇట్ అప్’ కార్యక్రమం విజయవంతమైన నేపథ్యంలో..
ఇదే స్ఫూర్తితో మోదీ ప్రభుత్వం నిరుపేద విద్యార్థుల కోసం మరో యోచన చేస్తోంది. దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో చదువుకునే పేద విద్యార్థులకు బోధన ఖర్చును భరించేందుకు ఎవరైనా ముందుకొచ్చేలా ప్రోత్సహించేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది.
‘ఒకరి బోధనకు.. ప్రతి ఒక్కరు (ఈచ్ వన్, టీచ్ వన్)’ పేరిట ప్రతిపాదిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా, అవకాశం ఉన్నవారంతా కనీసం ఒక పేద విద్యార్థి చదువుకు విరాళం అందించేలా ప్రోత్సహిస్తారు.
ఇందుకు గాను ఓ జాతీయ డిజిటల్ వేదికను ఏర్పాటు చేసి దాతలకు, విద్యార్థులు-విద్యాసంస్థలకు నేరుగా అనుసంధానం చేస్తారు. ఇలా అందించే విరాళాలకు పన్ను మినహాయింపు ఇచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.
సేవాతత్పరత ఉన్నవారితో పాటు, ఆయా విద్యాసంస్థల్లో గతంలో చదువుకున్నవారు కూడా ముందుకొచ్చి కనీసం ఒక పేద విద్యార్థికి బోధన రుసుం చెల్లించేలా ప్రోత్సహిస్తారు. దీనిద్వారా నిర్ణీత కాలానికి రూ. 25,000 కోట్లు సేకరించి, ఉన్నతవిద్యను అభ్యసించే దాదాపు 10 లక్షల మంది పేద విద్యార్థులకు సహాయం అందించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
ఈ విరాళాలను నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోనే జమయ్యేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వివరించారు.
క్రమేపీ ఆ మొత్తం విద్యాసంస్థలకు అందేలా ఏర్పాట్లు చేస్తారు. 2015 మార్చి 27న ప్రధాని మోదీ ‘గివ్ ఇట్ అప్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈమేరకు 2018 జూన్ వరకు 1.04 కోట్ల మంది వినియోగదారులు
గ్యాస్ రాయితీని వదులుకోవడానికి ముందుకొచ్చారు
0 Response to "విద్యాదానం చేయగ రండి! ‘గివ్ ఇట్ అప్’ స్ఫూర్తితో నిధుల సేకరణ"
Post a Comment