12 లక్షల పాఠశాలల్లో ఇక అల్పాహారం

ఈనాడు, దిల్లీ: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయపు అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్‌) కూడా వడ్డించాలని కేంద్రం యోచిస్తోంది. 


ఇప్పటికే మానవ వనరుల అభివృద్ధిశాఖ దీనిపై కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం సుమారు 12 లక్షల ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. 


వీటిల్లోనే అల్పాహార కార్యక్రమాన్ని కూడా అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. తద్వారా 12 కోట్ల మంది చిన్నారులకు లబ్ధి చేకూరుతుందని అంచనా! ‘‘ఆయా పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులు తీవ్ర పౌష్టికాహార లేమితో బాధపడుతున్నారు.


 ఒక పూట ఆహారం అందించడం వల్ల సమస్య కొంతవరకూ తగ్గింది. రెండు పూటలా ఆహారం అందిస్తే వారిలో పౌష్టికాహార లేమిని చాలామటుకు దూరం చేయవచ్చు. 


ఉచితంగా ఆహారం అందించడం ద్వారా పేద కుటుంబాల పిల్లలు బడులకు వచ్చే అవకాశమూ ఉంటుంది. అందుకే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.



అల్పాహారంలో భాగంగా విద్యార్థులకు పాలు, పండ్లు ఇవ్వాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని త్వరలోనే ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాల్లో ఆరంభించనున్నారు


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "12 లక్షల పాఠశాలల్లో ఇక అల్పాహారం"

Post a Comment