విద్యావ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలి

మంత్రి బొత్స సత్యనారాయణ 

తాడేపల్లి, జూన్‌12: విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలకు ప్రైవేటు విద్యాసంస్థలు సహకరిస్తూ

 


విద్యావ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలని విద్యా శాఖమంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. వడ్డేశ్వరంలోని కేఎల్‌ యూనివర్సిటిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (అపుస్మా)



 ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన రాష్ట్ర జనరల్‌ బాడీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు మాకు రెండు కళ్లులాంటివని, అపుస్మా అనుబంధ ప్రైవేట్‌ స్కూల్స్‌ పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించడం అభినందనీయమని అన్నారు. విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ మాట్లాడుతూ.. 




ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సమానమని, రెండు వ్యవస్థలూ ఆదేశాలు పాటిస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి

 



చేయాలని సూచించారు. అనంతరం అపుస్మా రాష్ట్రస్థాయి నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా ఎంవీ రామచంద్రారెడ్డి, జనరల్‌ సెక్రటరీగా తులసి విష్ణుప్రసాద్‌ ఎన్నికయ్యారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "విద్యావ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలి"

Post a Comment