కేంద్ర ఉద్యోగులకు వచ్చే నెలలో 5% డీఏ
న్యూఢిల్లీ, జూన్ 12: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే నెలలో కరువు భత్యం(డీఏ) 5ు పెరిగే అవకాశం ఉంది.
ఆలిండియా వినియోగదారుల ధరల సూచీ (ఏఐసీపీఐ) 127 పాయింట్లపైనే ఉంటున్నందున, ఆ మేరకు డీఏను పెంచుతారు.
దీనిపై కేంద్రం ఈ నెలాఖరులో ప్రకటన చేయనుంది. ద్రవోల్బణం పెరుగుదలతో ఏఐసీపీఐ మార్చిలో 126, ఏప్రిల్‌లో 127.7 పాయింట్లకు పెరిగింది.
మే, జూన్ నెలల గణాంకాలు సైతం 127 పాయింట్లకుపైనే ఉంటే, డీఏను 5ు వరకు పెంచే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏటా జనవరి, జూలైల్లో డీఏను సవరిస్తారు
0 Response to "కేంద్ర ఉద్యోగులకు వచ్చే నెలలో 5% డీఏ"
Post a Comment