వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్ మరిన్ని అదిరిపోయే ఫుచర్స్... New Feature In WhatsApp




దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే ప్రతిఒక్కరికీ వాట్సప్ గురించి తెలియకుండా ఉండదు. ప్రస్తుతం ప్రతిఒక్కరి స్మార్ట్‌ఫోన్లలో ఈ యాప్ తప్పనిసరిగా ఉంటుంది


ప్రపంచంలోనే ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ గా నిలిచిన వాట్సప్.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకర్షిస్తోంది. ఇటీవల ఒక స్మార్ట్ ఫోన్, నాలుగు డివైజ్‌లలో వాట్సప్ ఉపయోగించుకునే సదుపాయాన్ని వాట్సప్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో తాజాగా మరో అదిరిపోయే ఫీచర్ ను తీసుకొచ్చేందుకు వాట్సప్ కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు ఒక స్మార్ట్ ఫోన్ లో మాత్రమే వాట్సప్ ను ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది. అయితే ఒక అకౌంట్ ను రెండో స్మార్ట్‌ఫోన్లలో ఉపయోగించుకునేలా వాట్సప్ కొత్త ఫీచర్ ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. త్వరలో రానున్న ఈ కొత్త ఫీచర్ ద్వారా ఒక వాట్సప్ అకౌంట్ ను మరో ఫోన్ కు లింక్ చేసుకుని వాడుకోవచ్చు. వాట్సాప్‌ ఫీచర్లను ట్రాక్ చేసే డబ్ల్యూఏబీటాఇన్ఫో (WABetaInfo) ఈ కొత్త ఫీచర్ కు సంబంధించిన వివరాలను బహిర్గతం చేసింది. వాట్సప్ బీటా 2.22.10.13 వెర్షన్‌ అప్‌డేట్‌లో మల్టీడివైజ్ సెకండ్ వెర్షన్‌ ఫీచర్ కనిపించిందని డబ్ల్యూఏబీటాఇన్ఫో స్పష్టం చేసింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్ మరిన్ని అదిరిపోయే ఫుచర్స్... New Feature In WhatsApp"

Post a Comment