సెంట్రల్’ యూజీ కోర్సులకు కామన్ ఎంట్రన్స్
న్యూఢిల్లీ, మార్చి 21: సెంట్రల్ యూనివర్సిటీలు అందిస్తున్న యూజీ కోర్సుల్లో ప్రవేశానికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ను నిర్వహించనున్నట్టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు. జూలై మొదటివారంలో ఈ పరీక్ష ఉంటుందని వెల్లడించారు. సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) పేరుతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ పరీక్షను నిర్వహించనుంది. ఇంటర్మీడియట్ / 12వ తరగతి మార్కులకు అడ్మిషన్లలో ఎలాంటి వెయిటేజీ ఉండదు. కేవలం ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగానే ప్రవేశం కల్పిస్తారు. ఎన్‌టీఏ తయారుచేసే మెరిట్ లిస్ట్ ఆధారంగా యూనివర్సిటీలు వేటికవే అడ్మిషన్లు చేపడతాయి. కామన్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఉండదు. జామియా మిలియా ఇస్లామియా, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ సహా దేశంలోని మొత్తం 45 సెంట్రల్ యూనివర్సిటీలు ఈ ఎంట్రన్స్ ఆధారంగానే 2022-23 విద్యా సంవత్సరం నుంచి యూజీ ప్రవేశాలను చేపడతాయి. మంగళవారం దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఎన్‌టీఏ వెల్లడించనుంది
0 Response to "సెంట్రల్’ యూజీ కోర్సులకు కామన్ ఎంట్రన్స్"
Post a Comment