✍️అమ్మఒడి స్పష్టత* *కొరవడి!✍️📚* *♦ముగింపు దశలో విద్యాసంవత్సరం* *♦తల్లిదండ్రులపై తప్పని ఫీజులభారం
*🌻అనంతపురం విద్య, న్యూస్‌టుడే* : తల్లిదండ్రులకు తమ పిల్లల చదువులు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అమ్మఒడి పథకం ప్రవేశపెట్టింది. 2019-20 విద్యాసంవత్సరం నుంచి అమ్మఒడి పథకం అమలు చేస్తున్నారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేలు చొప్పున జమ చేస్తామని ప్రకటించారు. మొదటి సంవత్సరం రూ.15 వేలు జమ చేశారు. రెండో సంవత్సరం రూ.14 వేలు ఇచ్చారు. నవరత్నాల్లో పేర్కొన్న కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ఏటా జనవరి 26న తల్లుల ఖాతాలో సొమ్ము జమచేస్తామని ప్రకటించారు. 2020, 2021 సంవత్సరాల్లో పేర్కొన్న విధంగా సొమ్ము చెల్లించారు కూడా. అయితే 2021- 2022 విద్యా సంవత్సరంలో ఈ పథకంపై నీలినీడలు కమ్ముకొన్నాయి. జనవరిలో అమలు చేయాల్సిన పథకాన్ని జూన్‌లో చెల్లిస్తామని చెబుతున్నారు. ఈ విద్యాసంవత్సరం ఆరంభమై 8 నెలలు పూర్తయింది. ఇంతవరకూ దీని ఊసేలేదు. ఈ సంవత్సరం అమలు చేస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, కార్పొరేట్ పాఠశాలల్లో ఎక్కడ చదివినా ఈ పథకం వర్తిస్తుంది. కానీ, సాంకేతిక కారణాలతో అర్హులైనవారిలో చాలామందికి అందడం లేదు. రెండేళ్లలో అర్హులలో కొందరికి మాత్రమే లబ్ధి చేకూరింది.
*♦జూన్‌లో ఎవరికిస్తారో..?*
మే చివరి నాటికి విద్యార్థుల పరీక్షలన్నీ పూర్తవుతాయి. అకడమిక్ సంవత్సరం కూడా ముగుస్తుంది. జూన్‌లో కొత్త విద్యా సంవత్సరం ఆరంభం కావాలి. జూన్‌లో అమ్మఒడి అమలు చేస్తామంటున్నారు. విద్యాసంవత్సరం పూర్తయినవారికి చెల్లిస్తారా..? లేక కొత్త విద్యార్థులకు చెల్లిస్తారా అర్థం కావడం లేదు. 10వ తరగతి, ఇంటర్ పూర్తి చేసుకొన్నవారు విద్యాసంస్థల నుంచి బయటకెళ్లి, మరో కళాశాలలో చేరతారు. వారి పరిస్థితేంటనేది తెలియడం లేదు.
హాజరుశాతంతో మెలిక
రెండేళ్లు విద్యార్థుల హాజరుశాతంతో సంబంధం లేకుండా అమ్మఒడి చెల్లించారు. ఈ సంవత్సరం 75 శాతం హాజరుశాతం ఉంటేనే అర్హులని సర్క్యులర్ పంపారు. కరోనా కారణంగా ఈ విద్యాసంవత్సరం ఆగస్టు 16 నుంచి ఆరంభమైంది. ఏప్రిల్ 30 వరకూ పాఠశాలలు నిర్వహించనున్నారు. పాఠశాలల్లో కనీస పనిదినాలు 220 రోజులు ఉంటాయి. ఈ సంవత్సరం 180 రోజులు మాత్రమే. 75 శాతం హాజరు నమోదుపై తర్జనభర్జన పడుతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో పరిస్థితి దారుణం. విద్యార్థుల హాజరును యాప్‌లో రోజూ నమోదు చేయాలి. అనేక ప్రైవేటు పాఠశాలల్లో హాజరునమోదు సక్రమంగా చేపట్టడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఈ సమస్య ఉంది. ఇటీవల 857 మంది ప్రధానోపాధ్యాయులకు నోటీసులు కూడా పంపారు. ఇప్పటికీ ఆ సమస్య కొంత ఉంది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు హాజరునమోదు చేయకపోవడంతో కొందరు విద్యార్థులు అమ్మఒడికి దూరమయ్యే ప్రమాదం ఉంది.
ఇంటర్ విద్యార్థులకు కష్టమే
ఇంటర్ విద్యార్థులకు తొలి సంవత్సరం అమ్మఒడి కింద నగదు జమచేశారు. గత ఏడాది సక్రమంగా జమకాలేదు. ఈ సంవత్సరం జూనియర్ కళాశాలలకు ఎలాంటి సూచనలు రాలేదు. విద్యార్థుల హాజరు నమోదు చేయాలని కూడా ఆదేశాలు లేవు. దీంతో ఇంటర్ విద్యార్థులకు ఈసారి లబ్ధి చేకూరడం కష్టమే. జిల్లాలో 225 జూనియర్ కళాశాలలున్నాయి. అందులో 92 ప్రభుత్వ, ఎయిడెడ్, 133 ప్రైవేటు కళాశాలలున్నాయి. వీటిల్లో చదువుతున్న ఇంటర్ విద్యార్థులకు అమ్మఒడి అందడంపై అనుమానాలున్నాయి.
*♦ఆశలు నెరవేరేనా..!*
ఈ పథకం ద్వారా రూ.14 వేలు సొమ్ము ప్రభుత్వం చెల్లిస్తుందనే ఉద్దేశంతో కొందరు పేద తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించారు. రెండేళ్లు జనవరి 26న సొమ్ము జమకావడంతో పిల్లల ఫీజులు చెల్లించారు. ఈ సంవత్సరం జూన్‌లో అంటున్నారు. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ చివరినాటికి, 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు మేలో విద్యాసంవత్సరం ముగుస్తుంది. అప్పటిలోపు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజులు చెల్లించకపోతే ప్రైవేటు విద్యాసంస్థలవారు పరీక్షలకు కూడా అనుమతివ్వరు. కనీసం హాల్‌టికెట్లు కూడా ఇవ్వరని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
*♦హాజరైన సంవత్సరానికి అందుతుంది* - శామ్యూల్, జిల్లా విద్యాశాఖ అధికారి
జూన్‌లో అమ్మఒడి అందిస్తామని ప్రభుత్వం చెప్పింది. ఈ అంశంపై పూర్తిస్థాయి మార్గదర్శకాలు రావాల్సి ఉంది. అయితే విద్యార్థులు 2021-22 విద్యాసంవత్సరంలో ఏ తరగతిలో హాజరయ్యారు. ఆ విద్యాసంవత్సరానికి అమ్మఒడి జమచేస్తారు. 75 శాతం హాజరు తప్పనిసరి. హాజరుపై నిర్లక్ష్యం వహిస్తే ఆయా పాఠశాలలపై చర్యలు తీసుకుంటాం.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
0 Response to "✍️అమ్మఒడి స్పష్టత* *కొరవడి!✍️📚* *♦ముగింపు దశలో విద్యాసంవత్సరం* *♦తల్లిదండ్రులపై తప్పని ఫీజులభారం"
Post a Comment