ఆధార్ ఉంటేనే వైఎస్సార్ పెన్షన్ కానుక
అమరావతి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైఎస్సార్ పెన్షన్ కానుక ద్వారా అందించే పెన్షన్లన్నీ ఆధార్ ఆధారంగానే చెల్లించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించేందుకు ఆధార్ గుర్తింపు పత్రాన్ని వినియోగించాలని సూచించింది. ప్రతి నెలా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల తదితర సామాజిక పెన్షన్లు అందుకునే వారు ఆధార్ నంబర్, ఆధార్ అథెంటికేషన్ కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఎక్కడైనా ఆధార్ సెంటర్లు అందుబాటులో లేకపోతే ప్రభుత్వం వారి కోసం ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించింది. పెన్షన్ చెల్లింపులకు సంబంధించి వేలిముద్రలు సరిగా పడకుంటే ఐరిస్ స్కాన్/ఫేస్ అథెంటికేషన్, అదీ లేకపోతే ఆధార్ వన్‌టైం పాస్‌వర్డ్, వీలుకాకుంటే ఆధార్ కార్డు మీద ఉన్న క్యూఆర్ కోడ్ రీడర్ ద్వారా పెన్షన్లు అందించాలని సూచించారు
0 Response to "ఆధార్ ఉంటేనే వైఎస్సార్ పెన్షన్ కానుక"
Post a Comment