వాట్సాప్ తాజాగా మరో అదిరిపోయే ఫీచర్‌ను ప్రకటించింది
మెటా (గతంలో ఫేస్‌బుక్) యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జోడిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది
త్వరలోనే 2 జీబీ (2GB) వరకు ఫైల్ షేరింగ్ చేసుకునే ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ప్రస్తుతం 100 ఎంబీ కన్నా ఎక్కువ సైజు ఉన్న ఫైల్‌ను షేర్ చేసేందుకు వాట్సాప్‌లో అవకాశం లేదు. దీంతో పెద్ద సైజు ఉన్న ఫైల్స్‌ను షేర్ చేయలేకపోతున్నమంటూ చాలా రోజులుగా యూజర్లు వాట్సాప్ దృష్టికి తీసుకొస్తున్నారు. ఫైల్ సైజ్ పెంచాల్సిందిగా విజ్ఙప్తులు చేస్తున్నారు. దీంతో యూజర్ల ఇబ్బందులను తొలగించేందుకు వాట్సాప్(Whatsapp) సిద్దమవుతోంది. త్వరలో దీని కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనున్నట్లు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో (WABetaInfo) నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను అర్జెంటీనాలోని(Argentina) బీటా యూజర్లకు పరీక్షిస్తోంది. టెస్టింగ్ విజయవంతమైతే ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లందరికీ ఒకేసారి అందుబాటులోకి రానుంది. అయితే, టెస్టింగ్ దశలో విఫలమైతే ఫైల్ సైజును అస్సలు పెంచకుండా చేసే అవకాశం కూడా ఉంది.
బీటా యూజర్లకు టెస్టింగ్ దశలో ఉన్న ఫీచర్..
వాట్సాప్ తన ప్లాట్‌ఫారమ్‌లో పెద్ద ఫైల్ పరిమాణాలను షేర్ చేసే ఫీచర్‌పై పనిచేస్తుండటంతో యూజర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, వాట్సాప్‌కు గట్టి పోటీనిస్తోన్న టెలిగ్రామ్ ప్రస్తుతం 1.5 జీబీ డేటాను షేర్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. 2020 నుండి ఈ ఫీచర్‌ను అమలు చేస్తుంది. దీంతో, కొంత మంది యూజర్లు వాట్సాప్ నుంచి టెలిగ్రామ్‌కు మారారు. దీన్ని గ్రహించిన వాట్సాప్.. తన యూజర్లను చచేజార్చుకోకుండా త్వరలోనే 2 జీబీ షేరింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది.
గతంలో వాట్సాప్‌లో కేవలం 16 ఎంబీ సైజు ఉన్న ఫైల్స్‌ను మాత్రమే షేర్ చేసేందుకు సాధ్యమయ్యేది. తర్వాత, ఆ సైజును 100 ఎంబీకి పెంచారు. ప్రస్తుతం మార్కెట్లోకి అధిక సామర్థ్యం గల మొబైల్ కెమెరాలు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో వాటితో చిత్రీకరించే ఫోటో/వీడియో ఉత్తమమైన క్వాలిటీతో స్టోర్ అవుతున్నాయి. ఈ క్రమంలో వాటి ఫైల్ సైజ్ ఎక్కువగా ఉంటోంది. దీంతో వాట్సాప్ యూజర్లు ఆయా ఫోటోలను ఇతరులతో షేర్ చేసుకోలేకపోతున్నారు. అందుకే, ఫైల్ సైజు పెంచడంపై వాట్సాప్ దృష్టి పెట్టింది.
త్వరలోనే మెసేజ్ రియాక్షన్స్ ఫీచర్..
మరోవైపు, వాట్సాప్ మెసేజ్ రియాక్షన్స్ అనే ఫీచర్‌పై పని చేస్తోంది. ఈ ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్‌లో ఉన్న విధంగానే పనిచేస్తుంది. ఎంచుకున్న ఎమోజీలను ఉపయోగించి మెసేజ్‌లకు రియాక్షన్ ఇచ్చేందుకు వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్‌తో పాటుగా రియాక్షన్ నోటిఫికేషన్ ఫీచర్‌ను కూడా వాట్సాప్ తీసుకురానుంది. మరోవైపు, వాట్సాప్ మల్టీ-డివైస్ కంపాటెబులిటీ 2.0 అనే ఫీచర్‌పై కూడా పని చేస్తోంది. ఈ ఫీచర్ మీ ప్రైమరీ డివైజ్‌ని ఇంటర్నెట్‌కి ఎల్లవేళలా కనెక్ట్ చేయకుండానే అదే ఖాతాను ఉపయోగించి మరో స్మార్ట్‌ఫోన్‌లో మెసేజింగ్ యాప్‌ను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది
.

0 Response to "వాట్సాప్ తాజాగా మరో అదిరిపోయే ఫీచర్‌ను ప్రకటించింది"
Post a Comment