కేసులు తగ్గుతున్నాయ్.. ఆంక్షలు సవరించండి రాష్ట్రాలకు కేంద్రం లేఖ.. దేశంలో కొత్త కేసులు 30,615
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: దేశంలో కొవిడ్ కేసులు తగ్గిన నేపథ్యంలో కొవిడ్ ఆంక్షలను సవరించాలంటూ రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ బుధవారం లేఖ రాశారు. వారం రోజుల్లో రోజూ సగటున 50,476 కేసులు నమోదయ్యాయి. బుధవారం కొత్తగా 30,615 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. కేసులు వేగంగా తగ్గుతున్నందున జన సంచారాన్ని మరింత సులభం చేసేలా పలు కొవిడ్ ఆంక్షలను పునస్సtమీక్షించాల్సిన అవసరం ఉందని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఇదే సమయంలో 5 అంచెల ఫార్ములా(టె్‌స్ట-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్-కొవిడ్ నిబంధనల అమలు)ను తప్పకుండా పాటించాలని తెలిపింది. దేశంలో కొత్తగా 30,615 కేసులు నమోదవ గా, 514 మంది కొవిడ్‌తో మృతిచెందారు. వ్యాక్సినేషన్‌కు 173.86 కోట్ల టీకా డోసులను వినియోగించారు. గోవాలో 100ు మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది. ప్రపంచవ్యాప్తంగా కొత్త కొవిడ్ కేసుల సంఖ్య 19 శాతం మేర తగ్గిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది
0 Response to "కేసులు తగ్గుతున్నాయ్.. ఆంక్షలు సవరించండి రాష్ట్రాలకు కేంద్రం లేఖ.. దేశంలో కొత్త కేసులు 30,615"
Post a Comment