ఈహెచ్‌ఎస్ సమస్యలకు త్వరలో పరిష్కారం
ఉద్యోగ సంఘాలతో అధికారుల చర్చలు
అమరావతి, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎ్‌స) అమలులో నెలకొన్న సమస్యలపై బుధవారం సచివాలయంలో ఉద్యోగ సంఘాల స్టీరింగ్ కమిటీ ప్రతినిధులతో ఆర్థిక, వైద్యారోగ్యశాఖల ముఖ్య కార్యదర్శులు శశిభూషణ్‌కుమార్, అనిల్‌కుమార్ సింఘాల్ తదితరులు చర్చించారు. ఈహెచ్‌ఎ్‌స అమలులో ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఈహెచ్‌ఎ్‌సలో మరికొన్ని వ్యాధులను చేర్చడం, మెడికల్ రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఈ ఏడాది జూన్ వరకూ పొడిగించడం, బిల్లులను సకాలంలో చెల్లించడం, మేనేజ్‌మెంట్ కమిటీల్లో పెన్షనర్ల ప్రతినిధులను సభ్యులుగా చేర్చడం తదితర అంశాలపై అధికారులు సానుకూలంగా స్పందించారు. వీటిని సీఎస్ దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని శశిభూషణ్‌కుమార్ చెప్పారు. కొత్త వైద్య విధానాలను పథకంలోకి చేర్చడం, సకాలంలో బిల్లుల చెల్లింపు తదితర అంశాల అమలుపై తగు చర్యలు తీసుకుంటామని అనిల్‌కుమార్ సింఘాల్ అన్నారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ఏపీజేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు, ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సచివాలయ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, ఫ్యాప్టో చైర్మన్ జోసఫ్ సుధీర్‌బాబు, ఏపీటీఎఫ్ అధ్యక్షులు హృదయరాజు పాల్గొన్నారు.
మెడికల్ రీఎంబర్స్‌మెంట్ గడువు పొడిగిస్తూ వెంటనే ఆదేశాలు ఇవ్వాలని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో కోరినట్లు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. అన్ని నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి హెల్త్‌చెకప్ చేయాలని, మెడికల్ రీయింబర్స్‌మెంట్ సీలింగ్‌ను రెండు నుంచి ఐదు లక్షలకు పెంచాలని కోరామన్నారు. ఉద్యోగులకు స్మార్ట్ హెల్త్ కార్డులు ఇవ్వాలని
0 Response to "ఈహెచ్‌ఎస్ సమస్యలకు త్వరలో పరిష్కారం"
Post a Comment