21న విజయవాడలో మహా ధర్నా
విజయవాడ, న్యూస్‌టుడే: ప్రభుత్వోద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి సంయుక్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ఏపీ ఎన్జీవో పశ్చిమ కృష్ణా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్త నిరసనల్లో భాగంగా ఈ నెల 7న ఆందోళన కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. 21న అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, విజయవాడలో వేలాది మందితో మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆదివారం విజయవాడలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఉద్యోగులు, పింఛనర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్రంలో 13 లక్షల మంది ఉద్యోగులు సమాయత్తమయ్యారని చెప్పారు
0 Response to "21న విజయవాడలో మహా ధర్నా"
Post a Comment