ముఖ్యమంత్రి చెప్పిన హామీలు నెరవేరడం లేదు : జేఏసీ ఛైర్మన్



ఈనెల ఏడవ తేదీ నుంచి ప్రకటించిన ఉద్యమ కార్యాచరణను ఉద్యోగులు అందరూ విజయవంతం చేయాలి అని అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు
మేము దాచుకున్న, మాకు హక్కుగా రావాల్సిన డబ్బులు కొంతకాలంగా రావడం లేదు. గతంలో ముఖ్యమంత్రి చెప్పిన హామీలు నెరవేరడం లేదు అన్నారు. పీఆర్సీ నివేదిక లో ఉన్న అంశాలు కమిటీ సభ్యులు తెలిసినట్లు లేదు. పీఆర్సీ లో ఫిట్మెంట్ అంశం ఒక్కటే కాదు..

ఉద్యోగులకు సంబంధించిన చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల శ్రేయస్సు.. వారికి రావాల్సిన బకాయిల కోసమే మా పోరాటం.

ఉద్యమానికి ఉద్యోగులను సన్నద్ధం చేయడానికి శ్రీకాకుళం జిల్లా నుంచి కొందరు.. అనంతపురం జిల్లా నుంచి మేము సమావేశాలు చేపడుతున్నాం అని తెలిపారు. అలాగే ఉద్యమాల పురిటిగడ్డ అనంతపురం నుంచే ఉద్యోగుల ఆందోళన మొదలవుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించాలి అని పేర్కొన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ముఖ్యమంత్రి చెప్పిన హామీలు నెరవేరడం లేదు : జేఏసీ ఛైర్మన్"

Post a Comment