ఏపీ రీసెట్-2021 ఫలితాలు విడుదల
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), డిసెంబరు 31: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి చేపట్టిన ఏపీ రీసెట్-2021 పరీక్షల ఫలితాలను తిరుపతి ఎస్వీయూనివర్సిటీ వీసీ రాజారెడ్డి, రీసెట్ కన్వీనర్ శ్రీకాంత్‌రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. డిసెంబరు 7 నుంచి పదో తేదీ దాకా మొత్తం 71 సబ్జెక్టులకు జరిగిన పరీక్షలకు 9,933 మంది హాజరయ్యారని వారు తెలిపారు. వీరిలో 4,908 మంది (2,826 మంది పురుషులు, 2,082 మంది మహిళలు) ఉత్తీర్ణత సాధించారని వివరించారు. ఇంటర్వ్యూల షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేస్తామన్నారు. ఈ ఫలితాలను.. ‘ఎస్‌సీహెచ్‌ఈ.ఏపీ.గవర్నమెంట్.ఇన్’ వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు
0 Response to "ఏపీ రీసెట్-2021 ఫలితాలు విడుదల"
Post a Comment