AP News:నేటి నుంచి పింఛను పెంపు




ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైఎస్సార్‌ పింఛను కానుక పథకం కింద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు తదితరులకు రూ.250 పింఛను పెంపు శనివారం నుంచి అమల్లోకి రానుంది. దీంతో పింఛను మొత్తం
రూ.2,500 కానుంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ దీన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో దాదాపు 62 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారు. ఇందుకుగాను ప్రభుత్వం రూ.1,570 కోట్లు విడుదల చేసింది. లబ్ధిదారుల ఎంపికలో అత్యంత పారదర్శక విధానాన్ని అమలు చేస్తున్నామని ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "AP News:నేటి నుంచి పింఛను పెంపు"

Post a Comment