కర్నూలు జిల్లాలో హెచ్‌ఎంలకు షోకాజ్ నోటీసులుOct
కర్నూలు: జిల్లాలోని పలువురు హెచ్‌ఎంలకు ఆర్జేడీ షోకాజ్ నోటీసులు జారీ చేసారు. జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో మిడ్ డే మీల్స్‌లో భాగంగా విద్యార్థులకు చిక్కీలు, గుడ్లు పంపిణీ చేయాలి. కానీ వీటిని పంపిణీ చేయని కారణంగా భారీ సంఖ్యలో హెచ్‌ఎంలకు కడప ఆర్జేడీ షోకాజ్ నోటీసులు జారీ చేసారు. గుడ్లు, చిక్కీలు అన్‌సైజ్ ఉండటం వల్లే సప్లై చేయలేదని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు
కడప,అనంతపూర్ జిల్లాలలో కూడా ఇదే అంశంపై నోటీసులు వచ్చాయి. దీనిపై ప్రధానోపాధ్యాయులు గుసగుసలాడుకొంటున్నారు.జవాబులు రాయటానికి సన్నిద్దం అవుతున్నారు. వందల సంఖ్యల్లో ఉపాధ్యాయులు తాఖీదులు అందుకొన్నారు.

0 Response to "కర్నూలు జిల్లాలో హెచ్‌ఎంలకు షోకాజ్ నోటీసులుOct"
Post a Comment