అమరావతి: వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చి, ఉత్తమ సేవలందించిన వారికి వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుల ప్రదానోత్సవం సోమవారం జరగనుంది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ-కన్వెన్షన్ సెంటర్‌లో అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. 2021 సంవత్సరానికి 59 అవార్డులు ఇవ్వనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 29 వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్, 30 వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డులు ప్రదానం చేయనున్నారు. 9 సంస్థలకు, వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించి 11 అవార్డులు ఇవ్వనున్నారు. కళలు, సంస్కృతికి 20 అవార్డులు, సాహిత్యం-7, జర్నలిజం-6, కొవిడ్ సమయంలో సేవలందించిన ప్రభుత్వ వైద్య సిబ్బందికి-6 అవార్డులు ఇవ్వనున్నారు. నగదు పురస్కారంతో పాటు మెమొంటో, మెడల్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది. రాష్ట్రంలో తొలిసారిగా వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు, వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డులు ఇస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
0 Response to "AP News: వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు.. 59 మంది ఎంపిక"
Post a Comment