ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), అక్టోబరు 29: ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలను పెంపొందించడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి అన్నారు. యూనివర్సిటీల్లో ఇంటర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ (ఐక్యూఏసీ) నిర్వహణ - యూజీసీ ఉన్నత గుర్తింపును పొందడం అనే అంశంపై తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీ, ఎస్వీ యూనివర్సిటీల్లో నిర్వహించిన వర్క్‌షా్‌పలో ఆయన పాల్గొన్నారు. కాగా రాష్ట్రంలోని విద్యార్థులందరికీ స్కాలర్‌షిప్, ఫీజు రియంబర్స్‌మెంట్ ఇవ్వాలనే డిమాండుతో ఎస్‌ఎ్‌ఫఐ కార్యకర్తలు ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి పాల్గొన్న కార్యక్రమాలను అడ్డుకుని నిరసన తెలిపారు. జీవోలు-77, 44 లను తక్షణం రద్దు చేయాలని కోరారు.
0 Response to "ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచుతాం"
Post a Comment