Ayushman Bharat: ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ ఐడీ ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్’ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
దిల్లీ: భారత వైద్యారోగ్య రంగంలో నూతన అధ్యాయానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్’ను సోమవారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ ఐడీ
సమాచారానికి పూర్తి భద్రత..
ఈ మిషన్ ద్వారా దేశ పౌరుల ఆరోగ్య వివరాలు, రికార్డులను డిజిటలీకరణ చేయనున్నారు. ఈ క్రమంలో వారికి వ్యక్తిగత హెల్త్ ఐడీ ఇవ్వనున్నారు. ఈ ఐడీలో వారి ఆరోగ్య సమాచారాన్ని పొందుపర్చి.. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తారు. వైద్యులు, ఆసుపత్రులు, హెల్త్‌కేర్ సర్వీస్ ప్రొవైడర్లు ఈ సమాచారం ఆధారంగా సత్వర సేవలు అందించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. వ్యక్తుల ఆరోగ్య సమాచారానికి పూర్తి భద్రత ఉంటుందని తెలిపారు. గతేడాది ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని ఈ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆరు కేంద్రపాలిత ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతోంది. కార్యక్రమం ప్రారంభానికి ముందు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ మాట్లాడుతూ.. ప్రధాని ఈ మిషన్‌ను ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఆరోగ్య రంగంలో ఇది విప్లవాత్మక మార్పులను తెస్తుందని అభిప్రాయపడ్డారు
0 Response to "Ayushman Bharat: ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ ఐడీ ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్’ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ"
Post a Comment