కోవిడ్ మార్గదర్శకాల వ్యవధి పొడిగింపు

కోవిడ్ మార్గదర్శకాల వ్యవధి పొడిగింపు

న్యూఢిల్లీ : కోవిడ్ మార్గదర్శకాలను మరో నెల పాటు కేంద్రం పొడిగించింది. సెప్టెంబర్ 30 వరకూ కోవిడ్ మార్గదర్శకాలను పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ పేర్కొంది. కోవిడ్‌ మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని, రాష్ట్రాలన్నీ పూర్తి అప్రమత్తతతో ఉండాలని కేంద్ర హోంశాఖ కోరింది. ప్రజలు ఒకే చోట గుమిగూడకుండా ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు వహించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో యాక్టివ్ కేసులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయని, అందుకే తగు జాగ్రత్తలు వహించాలని సీఎస్‌లను కోరారు. దేశంలో వ్యాక్సినేషన్ సంతృప్తికరంగా సాగుతోందని, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇదే విధంగా ముందుకు సాగాలని అజయ్ భల్లా సూచించా

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "కోవిడ్ మార్గదర్శకాల వ్యవధి పొడిగింపు"

Post a Comment