31 నుంచి నవోదయ స్కూళ్లు పున:ప్రారంభం!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపధ్యంలో జవహర్ నవోదయ విద్యాలయాలు(జేఎన్వీ) ఈనెల 31 నుంచి తెరుచుకోనున్నాయి. అయితే 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు మాత్రమే తరగతులు నిర్వహించనున్నారు. కేంద్ర విద్యామంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం నవోదయ విద్యాలయాల్లో తరగతులను ఈనెల 31 నుంచి 50 శాతం విద్యార్థుల సామర్థ్యంతో నిర్వహించనున్నారు.



ఈ సమయంలో కరోనా గైడ్‌లైన్స్ పాటించనున్నారు. ఈ మేరకు కేంద్ర విద్యామంత్రిత్వశాఖ ఆయా కేంద్రీయ విద్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈనెల 31 నుంచి ఉన్నత తరగతులకు స్కూళ్లు తెరవడంతో పాటు ఆఫ్‌లైన్ క్లాసులను కూడా నిర్వహించనున్నారు. దీనికితోడు పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ఆరోగ్యంపై ప్రత్యేక కౌన్సెలింగ్ కూడా ఇవ్వనున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "31 నుంచి నవోదయ స్కూళ్లు పున:ప్రారంభం!"

Post a Comment