తొలి ప్రెమరీ ఎలిమెంటరీ స్కూల్స్ ఏర్పాటు: వనితాAug
: ఏపీలో తొలి ప్రీ ప్రైమరీ ఎలిమెంటరీ స్కూల్స్ ఏర్పాటైంది. వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన విద్యావిదానంలో భాగంగా ఎలిమెంటరీ స్కూల్స్‌ను అంగన్ వాడీ కేంద్రాలలో విలీనం చేసే కార్యక్రమం ప్రారంభమైంది. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో
తొలిలిలి ప్రీ ప్రైమరీ ఎలిమెంటరీ స్కూల్స్ ఏర్పాటు చేశారు. పెదకాకాని మండలం వెనిగండ్లలో ఏర్పాటు చేసిన ఈ స్కూల్‌ను శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనితా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వనితా మాట్లాడుతూ పాఠశాలల్లో సరైన మౌళిక సదుపాయాలు కల్పించేందకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. నాడు - నేడు కార్యక్రమం ద్వారా మోడల్ అంగన్ వాడీ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరువేల భవనాలు కట్టించాల్సి ఉందని వాటిని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. 4000 వేల పాఠశాలలను నాడు నేడులో భాగంగా ఆధునీకరిస్తున్నామని వనితా తెలిపారు
0 Response to "తొలి ప్రెమరీ ఎలిమెంటరీ స్కూల్స్ ఏర్పాటు: వనితాAug"
Post a Comment