గ్యాస్‌ కనెక్షన్‌ కావాలా? 8454955555కు మిస్డ్‌కాల్‌ ఇవ్వండి ఐఓసీ కొత్త సదుపాయం

దిల్లీ: దేశంలో అతిపెద్ద ఇంధన సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) సరికొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. కొత్త ఇండేన్‌ వంటగ్యాస్‌ (ఎల్‌పీజీ) కనెక్షన్‌ కోసం 8454955555 నెంబరుకు మిస్డ్‌కాల్‌ ఇవ్వడం ద్వారా నమోదు 

చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ప్రస్తుత వినియోగదారులు నమోదిత ఫోన్‌ నంబరు నుంచి ఈ నెంబరుకు మిస్డ్‌కాల్‌ ఇవ్వడం ద్వారా గ్యాస్‌ సిలిండర్‌ రీఫిల్‌ బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది. దేశంలో ఎక్కడైనా మిస్డ్‌కాల్‌తో కొత్త ఎల్‌పీజీ కనెక్షన్‌ పొందే సౌకర్యాన్ని సోమవారం ఐఓసీ ఛైర్మన్‌ ఎస్‌ఎం వైద్య ప్రారంభించారు. వినియోగదారుడి ఇంటి వద్దే రెండో సిలెండర్‌ (డబుల్‌ బాటిల్‌ కనెక్షన్‌-డీబీసీ) పొందే సదుపాయాన్ని మొదలుపెట్టారు. ఒకే సిలెండర్‌ కలిగిన వారు వినియోగదారులు డీబీసీకి మారే అవకాశాన్ని డెలివరీ సిబ్బంది కల్పిస్తారు. ఆసక్తి కలిగిన వినియోగదారులు సాధారణ 14.2 కేజీ సిలిండర్‌కు బదులు 5కేజీ సిలిండర్‌ను కూడా ఎంపికచేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సదుపాయాలు అందిస్తున్న ఏకైక చమురు మార్కెటింగ్‌ కంపెనీగా ఐఓసీ ఉంది. భారత్‌ బిల్‌ పేమెంట్‌ వ్యవస్థ, ఇండియన్‌ ఆయిల్‌ వన్‌ యాప్‌, వెబ్‌సైట్‌లపై కూడా  వినియోగదారులు సిలిండర్‌ బుక్‌ చేసుకుని, చెల్లింపులు చేయొచ్చు. వాట్సాప్‌ (7588888824), ఎస్‌ఎంఎస్‌/ఐవీఆర్‌ఎస్‌ (7718955555), అమెజాన్‌ అలెక్సా, పేటీఎంలపైనా ఈ సదుపాయం ఉందని కంపెనీ వెల్లడించింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "గ్యాస్‌ కనెక్షన్‌ కావాలా? 8454955555కు మిస్డ్‌కాల్‌ ఇవ్వండి ఐఓసీ కొత్త సదుపాయం"

Post a Comment