ఓటరు నమోదుకు దరఖాస్తుల ఆహ్వానం


అమరావతి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): కొత్తగా ఓటర్ల నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌-2022 కార్యక్రమాన్ని చేపట్టింది. 2022 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండేవారు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్‌ తెలిపారు. ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌, కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లలోనూ నమోదు కావచ్చొని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నవంబరు 20, 21 తేదీల్లో పోలింగ్‌ కేంద్రాల వారీగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. డిసెంబరు 20 వరకు అభ్యంతరాలు, క్లైమ్స్‌ పరిష్కరిస్తారని, 2022 జనవరి 5న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తారని తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఓటరు నమోదుకు దరఖాస్తుల ఆహ్వానం"

Post a Comment