10 ఉపాధ్యాయ సంఘాల పోరుబాట
సీపీఎస్ రద్దు కోసం ఫ్యాప్టో ఆధ్వర్యంలో పది ఉపాధ్యాయ సంఘాలు పోరుబాట పట్టనున్నాయి. సీపీఎస్ అమలు చేసిన రోజునే సెప్టెంబరు 1 నుంచి దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభించనున్నారు. ప్రభుత్వం తీరు పై పోరాటానికి ఫ్యాప్టో ఆధ్వర్యంలో 10 ఉపాధ్యాయ సంఘాలు ఏకతాటి పైకి వచ్చాయి. ఏపీటీఎఫ్ (రెండు అసోసియేషన్లు), యూటీఎఫ్, ఎస్‌టీయూ, బీటీఏ, ఏపీపీటీఏ, ఎస్సీ ఎస్టీ టీచర్స్ అసోసియేషన్, హెడ్ మాస్టర్స్ అసోసియేషన్, సీపీఎస్ అసోసియేషన్లు ఉమ్మడిగా ఈ ఆందోళనలో పాల్గొననున్నాయి. . 2004లో సీపీఎస్ విధానం అమల్లోకి తెచ్చింది. ఈ పథకం ద్వారా పెన్షన్ గ్యారంటీ లేకుండా పోయింది. ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు జగన్ పాదయాత్ర సందర్భంగా సీపీఎ్‌సను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు
కొత్త ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా సీపీఎస్ రద్దు కాకపోవటంతో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలు నిరవధిక ఆందోళనలకు కార్యాచరణ రూపొందించుకున్నాయి. సెప్టెంబరు 1వ తేదీ నుంచి రోజుకో రకంగా వినూత్న రీతిలో ఆందోళనలు చేయాలని నిర్ణయించారు. ప్రతి జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. రోజూ నల్లబ్యాడ్జీలతో విధుల్లో పాల్గొనడం, భోజన విరామ సమయంలో ఆందోళనలు చేయడం, చర్చా వేదికలు నిర్వహించటం, విద్యార్థుల తల్లిదండ్రులకు సీపీఎస్ ఇబ్బందుల గురించి వివరించటం తదితర అనేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
Struggle for success
ReplyDelete