జమిలి ఎన్నికలకు సిద్ధంDec
ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా వెల్లడి
న్యూఢిల్లీ, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): దేశమంతటా లోక్‌సభ, శాసనసభలకు జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు. సోమవారం ఓ ఇం టర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన అన్ని చట్ట సవరణలను పార్లమెంటు ఆమోది స్తే జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సంసిద్ధంగా ఉందన్నారు.
జమిలి ఎన్నికలను నిర్వహించాల న్న అభిప్రాయాన్ని ప్రధాని నరేంద్రమోదీ కూడా పలు సందర్భాల్లో వ్యక్తం చేసిన నేపథ్యంలో సీఈసీ వ్యాఖ్యలు ప్రాధా న్యం సంతరించుకున్నాయి. జమిలి ఎన్నికలు 2024లో సార్వత్రిక ఎన్నికలతోపాటు జరుగుతాయా, లేక ముందే జరుగుతాయా అన్న అంశంపై కూడా ఇప్పటికే రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చలు ప్రారంభమయ్యాయి.
కాగా లోక్‌సభ, శాసన సభల కాలపరిమితిని తగ్గించడం, పెంచడం, రాజ్యాంగంలో సంబంధిత నిబంధనలను సవరించి, రాష్ట్రాల ఆమోదం పొం దడం, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951ని సవరించడం ద్వారానే జమిలి ఎన్నికలకు మార్గం సుగమం అవుతుందని రాజ్యాంగ నిపుణులు ఇప్పటికే ప్రభుత్వానికి సూచించారు. లా కమిషన్ కూడా ఇప్పటికే ఈ మేరకు కేంద్రానికి ముసాయిదా నివేదికను సమర్పించింది
0 Response to "జమిలి ఎన్నికలకు సిద్ధంDec"
Post a Comment