నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం
ఈనాడు, దిల్లీ: ప్రధాని మోదీ మంగళవారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెండు వేర్వేరు సమావేశాలు నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
కరోనా కేసులు అధికంగా ఉన్న 8 రాష్ట్రాల సీఎంలతో ఉదయం 10 గంటలకు మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వ్యాక్సినేషన్ భవిష్యత్తు కార్యాచరణపై అన్ని రాష్ట్రాల సీఎంలతో చర్చించనున్నట్లు తెలిసింది.
వ్యాక్సినేషన్‌కు ప్రాధాన్య క్రమం గుర్తింపు, శీతలీకరణ సదుపాయాలు, మానవ వనరుల సమీకరణ లాంటి అంశాలపై సీఎంల అభిప్రాయాలు తెలుసుకొని, వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం
0 Response to "నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం"
Post a Comment