వారికి కేంద్రం దీపావళి గిఫ్ట్... ఈపీఎఫ్‌ఓ నుంచి చేతికి రెట్టింపు డబ్బు

న్యూఢిల్లీ : పీఎఫ్ ఖాతాదారులకు  కేంద్ర ప్రభుత్వం నుంచి తీపికబురు అందనుంది. కనీస పెన్షన్‌ను రెట్టింపు చేయొచ్చని వినవస్తోంది. ఇదే  జరిగితే 60 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది. వివరాలిలా ఉ్నాయి. కార్మిక మంత్రిత్వ శాఖ కనీస పింఛనును పెంచాలని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ కనీస పెన్షన్ పెంచేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా సుముఖంగా ఉన్నట్లు సమాచారం. దీపావళి నాటికి పెన్షన్ పెంపు నిర్ణయం ప్రటకన ఉండొచ్చనే తెలుస్తోంది. 


ప్రస్తుతం పీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు కనీస పెన్షన్ రూ. వెయ్యి. దీనిని రూ. 2 వేలకు పెంచాలని ఆర్ధిక శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించినట్ు సమాచారం. 


కనీస పెన్షన్‌ను రెట్టింపు చేసినపక్షంలో రూ. 2 వేలు-రూ. 2,500 కోట్ల వరకు కేంద్రం అదనపు భారాన్ని మోయాల్సి వస్తుంది. కాగా పీఎఫ్ చందాదారులు మాత్రం కనీస పెన్షన్‌ను రూ. 3 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా... కేంద్ర ప్రభుత్వపు పెన్షన్ పెంపు నిర్ణయం అమలవుతే... దాదాపు 60 లక్షల మందికి ప్రయోజనం కలుగనుంది.


కాగా ఈపీఎఫ్‌వో నిబంధనల మేరకు... ఉద్యోగుల వేతనంలో 12 శాతం (బేసిక్ + డీఏ) కట్ అయ్యి, ఈ మొత్తం పీఎఫ్ ఖాతాలో జమవుతుంది. కంపెనీ కూడా అంతే మొత్తాన్ని ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో క్రెడిట్ చేస్తుంది. ఉద్యోగి 12 శాతం కంట్రిబ్యూషన్‌లో 8.33 శాతం ఈపీఎస్ ఖాతాకు వెళుతుంది. ఉద్యోగికి 58 ఏళ్లు దాటిన తర్వాత ఈపీఎస్ ఖాతా నుంచి ప్రతి నెలా పింఛను అందుతుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

1 Response to "వారికి కేంద్రం దీపావళి గిఫ్ట్... ఈపీఎఫ్‌ఓ నుంచి చేతికి రెట్టింపు డబ్బు"

  1. Our Central Government has taken a good decision in the aspect of Pension. 60 lakh people will get benifit. Really it is a good news.

    ReplyDelete