ఏడాదిలో ఎప్పుడైనా డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌

  • 67 లక్షల మంది పింఛనుదార్లకు ప్రయోజనం: కేంద్రం


న్యూఢిల్లీ, నవంబరు16: కొవిడ్‌ వల్ల పింఛనుదార్లు డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌(డీఎల్‌సీ) సమర్పించేందుకు అనేక మార్గాలను అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. దీంతో 67 లక్షల మంది పింఛనుదార్లకు లబ్ధి చేకూరనుంది. పింఛనుదార్లు పింఛను సొమ్ము తీసుకునే బ్యాంకులో లేదా సమీపంలోని పోస్టాఫీసుల్లో లేదా ఉమాంగ్‌ యాప్‌ ద్వారా కూడా డీఎల్‌సీలు సమర్పించవచ్చని వివరించింది. తాజాగా ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఇంటి వద్దే డీఎల్‌సీ సమర్పించే అవకాశం కల్పించింది. పెన్షనర్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే పోస్ట్‌మ్యాన్‌ వచ్చి డీఎల్‌సీ ప్రక్రియను పూర్తి చేస్తారు. పెన్షనర్లు ఇకపై ఏడాదిలో ఎప్పుడైనా డీఎల్‌సీ సమర్పించవచ్చు. వారు డీఎల్‌సీ ఇచ్చిన తేదీ నుంచి ఏడాది పాటు చెల్లుబాటవుతుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏడాదిలో ఎప్పుడైనా డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌"

Post a Comment