మార్చి వరకు బీమా ఆన్‌లైన్
మార్చి వరకు బీమా ఆన్‌లైన్
ముంబయి: జీవిత బీమా తీసుకోవాలనుకునే వారు ఎలక్ట్రానిక్ పద్ధతిలో తమ సమ్మతి తెలిపేందుకు 2021 మార్చి 31 వరకు గడువు పొడిగిస్తున్నట్లు భారతీయ బీమా అభివృద్ధి, నియంత్రణ ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) వెల్లడించింది. కరోనా మహమ్మారి వ్యాప్తితో వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడిన నేపథ్యంలో, గత ఆగస్టులో ప్రయోగాత్మక పద్ధతిన ఐఆర్‌డీఏఐ ఆన్‌లైన్ పాలసీలకు అనుమతించింది. ఇందువల్ల పాలసీదార్లు, బీమా సంస్థలకు ఊరట లభించింది. ఇప్పుడు ఆ గడువును మరో 3 నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకొంది. జీవిత బీమా పాలసీదార్ల నుంచి వస్తున్న స్పందన, బీమా సంస్థలు అందుకు సన్నద్ధమైన తీరును పరిగణనలోకి తీసుకున్న ఐఆర్‌డీఏఐ తాజాగా అన్ని బీమా ఉత్పత్తులకు ఈ గడువును పెంచుతూ సర్క్యులర్ జారీ చేసింది
0 Response to "మార్చి వరకు బీమా ఆన్‌లైన్"
Post a Comment