ఎస్‌బీఐలో కొత్తగా 2000 పీవోలు
- నోటిఫికేషన్ విడుదల చేసిన బ్యాంక్
- దరఖాస్తుకు ఆఖరు తేదీ డిసెంబరు 4
- మూడంచెల విధానంలో ఎంపిక ప్రక్రియ
హైదరాబాద్, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): దేశంలోనే అగ్రగామి బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎ్‌సబీఐ) రెండు వేల ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో కేటగిరీల వారీగా జనరల్- 810, ఎస్సీ-300, ఎస్టీ-150, ఓబీసీ-540, ఈడబ్ల్యూఎస్- 20 పోస్టులను కేటాయించారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ చివరి సంవత్సరం లేదా ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న వారు సైతం అర్హులే. అభ్యర్థుల వయస్సు 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు రిజర్వ్‌డ్ కేటగిరీలకు సడలింపు ఉంటుంది. మూడంచెల విధానంలో... ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామిషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. పరీక్ష ఫీజు రూ.750 కాగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మినహాయింపు ఇచ్చారు. ఈ ఏడాది డిసెంబరు 4వ తేదీలోపు https://bank.sbi/carrers, https://www.sbi.co.in/carrers ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఏడాది డిసెంబరు 31, వచ్చే ఏడాది జనవరి 2, 4, 5 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుంది. ఇందులో మెరిట్ ఆధారంగా జనవరి 29న జరిగే మెయిన్ పరీక్షకు అభ్యర్థులను అనుమతిస్తారు. ఫిబ్రవరి లేదా మార్చిలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా మార్చి నెలాఖరులో అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేస్తారు
0 Response to "ఎస్‌బీఐలో కొత్తగా 2000 పీవోలు"
Post a Comment