ఎల్‌టీసీ నగదు ఓచర్లపై కేంద్రం శుభవార్త
- కుటుంబ సభ్యులూ కొనుగోలు చేయొచ్చు
న్యూఢిల్లీ, నవంబరు 11: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త. ఎల్‌టీసీ నగదు ఓచర్లపై ఉద్యోగి కుటుంబ సభ్యులు సైతం కొనుగోలు చేసేందుకు కేంద్రం అనుమతిచ్చింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండీచర్ ఈ విషయాన్ని వెల్లడించింది. అక్టోబరు 12 తర్వాత చేసి న కొనుగోళ్లకు సంబంధించిన బిల్లులనే రీయింబర్స్ చేసుకునే వెసులుబాటును
కల్పించింది. ఎల్‌టీసీ నగదు ఓచర్ పథకాన్ని అక్టోబరు 12న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద 12ు లేదా అంత కు మించిన జీఎస్టీ రేటుతో ఉద్యోగులు ఏవైనా వస్తువుల ను కొనుగోలు చేయొచ్చు. ఈ కొనుగోళ్ల బిల్లులను ఆన్‌లైన్/డిజిటల్ లేదా చెక్ ద్వారా మాత్రమే చెల్లించాలి.
ఎల్‌టీసీ నగదు ఓచర్ పథకం వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. నెలవారీ వాయిదాల్లోనూ వస్తువుల కొనుగోళ్లను కేంద్రం అనుమతించనుంది
0 Response to "ఎల్‌టీసీ నగదు ఓచర్లపై కేంద్రం శుభవార్త"
Post a Comment