ఏపీలో 829మంది టీచర్లకు కరోనా! 575 విద్యార్థులకూ సోకిన వైరస్‌

అమరావతి: ఏపీలో నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు ప్రారంభం కావడంతో కరోనా బుసలు కొడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభు



పాఠశాలల్లో ఇప్పటివరకు 829మంది ఉపాధ్యాయులు, 575 మంది విద్యార్థులు కరోనా బారిన పడినట్టు పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. 9, 10 విద్యార్థులకు ఈనెల 2 నుంచి రోజువిడిచి రోజు ఒంటిపూట తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మొత్తంగా 41,623 ప్రభుత్వ పాఠశాలల్లో 70,790 మంది ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు చేయగా.. 829మందికి పాజిటివ్‌గా తేలింది. అలాగే, 95,763 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా.. 575మందిలో వైరస్‌ ఉన్నట్టు నిర్ధారణ అయింది. 


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " ఏపీలో 829మంది టీచర్లకు కరోనా! 575 విద్యార్థులకూ సోకిన వైరస్‌"

Post a Comment