మారుతున్న బ్యాంకు రూల్స్, డిసెంబర్ 2020 నుండి RTGS
RTGS డిసెంబర్ 2020 నుండి 24 గంటలు అందుబాటులో ఉంటుందని ఆర్బీఐ ప్రకటించింది
ఆర్టీజీఎస్ అంటే
ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. మనీని ట్రాన్సుఫర్ చేసేందుకు దీనిని ఉపయోగిస్తారు. ఆర్టీజీఎస్ ద్వారా కనీసం రూ.2 లక్షల మొత్తాన్ని పంపించవచ్చు. ఆర్బీఐ FAQ ప్రకారం గరిష్ట పరిమితి లేదు. అయితే బ్యాంకులు సాధారణంగా రూ.10 లక్షల గరిష్టాన్ని అనుమతిస్తున్నాయి.
బ్యాంకు ప్రయోజనం అందిస్తే
ఇక నెఫ్ట్ గత ఏడాది నుండి 24X7 అందుబాటులోకి వచ్చింది. ఇది ఉచితం. ఆర్టీజీఎస్ బదలీపై ఛార్జీ ఉంటుంది. ఈ ఛార్జీలు బ్యాంకు నుండి బ్యాంకుకు మారుతుంటాయి. అక్టోబర్ 30, 2019 ప్రకారం జూలై 1, 2019 నుండి ఆర్టీజీఎస్ పైన విధించే ప్రాసెసింగ్ ఛార్జీలను ఆర్బీఐ మాఫీ చేసింది. బ్యాంకులు ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు అందించవచ్చు.
- రూ.2 లక్షల నుండి రూ.5 లక్షల వరకు పన్ను మినహాయించి ఏదైనా ఉంటే రూ.24.50 దాటవద్దు.
రూ.5 లక్షలు మించితే రూ.49.50 దాటకూడదు
0 Response to "మారుతున్న బ్యాంకు రూల్స్, డిసెంబర్ 2020 నుండి RTGS"
Post a Comment