భత్యం 'కరువు'..!



భత్యం 'కరువు'..!
అందని మూడు ఏళ్ల బిల్లులు - అల్లాడుతున్న ఉద్యోగులు


ఆరు నెలలకు ఒకసారి ఉద్యోగులకు ఇచ్చే కరువు భత్యం చెల్లించడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కేస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు మూడు ఏళ్లకు సంబంధించిన బిల్లులు ఉద్యోగులకు పెండింగ్‌లోనే ఉంది. ఈ రోజు, రేపు అంటూ ప్రభుత్వం కాలం వెల్లదీస్తుండడంపై వారు ఆందోళన చెందుతున్నారు. 2018 జూలై నుంచి ఈ డబ్బులు పెండింగ్‌లోనే ఉన్నాయి. వెంటనే ఇవ్వాలని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు డిమాండు చేస్తున్నాయి. రెండున్నరేళ్లగా వారు ఓపిక పట్టారు. అయితే ప్రభుత్వం నుంచి ముందడుగు పడకపోవడంతో వారు ఆందోళనకు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
జెఎసి నేతృత్వంలో త్వరలో దశలవారీ ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ప్రకటించిన మూడు డిఎలనైనా త్వరగా విడుదల చేయాలని ఒత్తిడి తీసుకురావాలని ఉద్యోగ ఉపాధ్యాయులు చర్చలు జరుపుతున్నారు. ధరలకు అనుగుణంగా కరువు భత్యాలు చెల్లించాల్సి ఉండగా ప్రస్తుత పరిస్థితుల్లో కరువు భత్యాలు దీర్ఘకాలంగా సాగదీత దోరణిలో చెల్లిస్తామని చెప్పడం దారుణమని వాపోతున్నారు. డిఎల విషయంలో పునరాలోచించాలని కోరుతున్నారు. వాయిదాల పద్ధతిలో కాకుండా ఇవ్వాలని కోరుతున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "భత్యం 'కరువు'..!"

Post a Comment