11 రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాలు ఇలా
11 రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఫలితాలు ఇలా ఉన్నాయి..
* ఛత్తీస్‌గఢ్‌లో ఒకస్థానానికి ఉపఎన్నిక జరగ్గా కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్‌కు 56శాతం ఓట్లు పోలవ్వగా రెండోస్థానంలో ఉన్న భాజపాకు 36శాతం ఓట్లు పోలయ్యాయి.
* గుజరాత్‌లో ఎనిమిది స్థానాల్లో భాజపా అన్నిచోట్లా విజయం సాధించింది. ఇక్కడ కూడా రెండు పార్టీల మధ్య దాదాపు 20శాతం ఓట్ల తేడా ఉంది. భాజపాకు 55శాతం ఓట్లు రాగా కాంగ్రెస్‌కు 34శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
* హరియాణాలో ఒక స్థానానికి ఎన్నిక జరగ్గా .. ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధించింది. భాజపా అభ్యర్థిపై దాదాపు పదివేల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు.
* ఝార్ఖండ్‌లో రెండు స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ ఒక స్థానంలో, జేఎంఎం మరోస్థానంలో గెలుపొందాయి.
* కర్ణాటకలో రెండు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. రెండింటిలో భాజపా విజయం సాధించింది.
* మధ్యప్రదేశ్‌లో 28స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. వీటిలో భాజపా ఇప్పటికే 17చోట్ల విజయం సాధించగా మరో రెండు చోట్ల ఆధిక్యంలో ఉంది. మరో ఏడు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందగా.. రెండు స్థానాల్లో ముందంజలో ఉంది.
* మణిపూర్‌లో ఐదు స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఇప్పటికే నాలుగు స్థానాల్లో భాజపా, మరోస్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు.
* నాగాలాండ్‌లో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఇక్కడ ఒక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి, మరోస్థానంలో ఎన్‌డీపీపీ అభ్యర్థి విజయం సాధించారు. ఇక్కడ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఒక్కశాతం ఓట్లు కూడా సాధించలేదు. ఇక భాజపాకు మాత్రం 14శాతం ఓట్లు వచ్చినప్పటకీ పోటీ ఇవ్వలేకపోయింది.
* ఒడిశాలో రెండు స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా.. ఇక్కడ రెండు స్థానాల్లోనూ బిజూ జనతాదళ్(బీజేడీ) విజయం సాధించింది.
* తెలంగాణలో ఒక స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడ భాజపా విజయం సాధించింది. అయితే, భాజపా, తెరాస పార్టీల మధ్య చివరివరకూ హోరాహోరీ పోరు కొనసాగింది. చివరకు వెయ్యి ఓట్ల మెజారిటీతో భాజపా అభ్యర్థి విజయం సాధించారు.
*ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏడు స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఇక్కడ ఆరు స్థానాల్లో భాజపా, ఒకచోట ఎస్పీ విజయం సాధించాయి
0 Response to "11 రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాలు ఇలా"
Post a Comment