2021: సెలవులను ప్రకటించిన సిఎస్

వచ్చే సంవత్సరం 2021లోని సెలవులను ప్రభుత్వం ముందస్తుగా ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే సంవత్సరం అన్ని ఆదివారాలు, రెండో శనివారాల్లో (ఫిబ్రవరి 13 శనివారం తప్ప) అన్ని ప్రభుత్వ ఆఫీసులకు సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. 




నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే జనవరి 1వ తేదితో పాటు అదే నెలలో 26న వచ్చే గణతంత్ర దినోత్సవ వేడుకలతో పాటు స్వాతంత్ర దినోత్సవమైన ఆగస్టు 15తో పాటు పండుగలు, మహానీయుల జయంతి, వర్థంతిలతో కలుపుకుని డిసెంబర్ 26న వచ్చే బాక్సింగ్ డేతో కలుపుకుని ఏడాది మొత్తానికి 28 సెలవులను సిఎస్ అధికారికంగా ప్రకటించారు. జనవరి 1వ తేదిన సెలవును ప్రకటించినందుకు ఆ తర్వాత ఫిబ్రవరి 13న వచ్చే రెండో శనివారం రోజున వర్కింగ్ డేగా ప్రకటించారు



ఉద్యోగులు సంవత్సరానికి ఐదు వరకు ఆప్షనల్ సెలవులను తీసుకోవచ్చునని తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "2021: సెలవులను ప్రకటించిన సిఎస్"

Post a Comment