అరచెయ్యే... డెబిట్ / క్రెడిట్ కార్డ్...

వాషింగ్టన్ : ప్రముఖ 'ఈ కామర్స్ సంస్థ... 'అమెజాన్'... తాజాగా... బయోమెట్రిక్ చెల్లింపుల విధానాన్ని అమల్లోకి తెచ్చింది. 'అమెజాన్ వన్' పేరుతో ఈ కొత్త ఫీచర్ తో వినియోగదారులకు పూర్తి వెసులుబాటు ఉంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. వివరాలిలా ఉన్నాయి. సాధారణంగా ఎవరికైనా డబ్బులు పంపించాలన్నా, లేదంటే దుకాణాల్లో బిల్లు కట్టాలన్నా... క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు వాడాలి. లేదా... నెట్ బ్యాంకింగ్ తో లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. లేదా... గూగుల్ పే, ఫోన్‌ పే, పేటీఎం, భీమ్ వంటి యాప్‌లతో లావాదేవీలను నిర్వహించవచ్చు. 

కాగా... 'అమెజాన్ వన్ పేమెంట్ సిస్టమ్‌'లో



వీటి అవసరముండబోదు. కేవలం... మన అరచేతితోనే లావాదేవీలను పూర్తి చేయొచ్చు. ఇది పూర్తిగా 'కాంటాక్ట్‌లెస్' విధానం.

ఎటువంటి కార్డూ లేకుండానే షాపింగ్ చేయొచ్చు. రానున్న రోజుల్లో... పెద్ద సంఖ్యలో స్టోర్లలో ఈ పేమెంట్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అమెజాన్ సన్నాహాలు చేస్తోంది. గతంలో...

అలి పే అనే కంపెనీ... 'స్మైల్ టు పే' పేమెంట్ సిస్టమ్‌ను తీసుకువచ్చింది. కాగా... అరచేతి తో చెల్లింపులు జరిపే విధానం త్వరలోనే అంతర్జాతీయంగా ప్రముఖ పాత్ర పోషిస్తుందని అమెజాన్ వర్గాలు చెబుతున్నాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

0 Response to "అరచెయ్యే... డెబిట్ / క్రెడిట్ కార్డ్..."

Post a Comment