రేపు దిల్లీకి సీఎం ఎల్లుండి ప్రధానితో సమావేశం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం సాయంత్రం దిల్లీ వెళ్లనున్నారు.
మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆయన భేటీ అయ్యే అవకాశముందని
తెలిసింది. సోమవారం ఉదయం జగన్ కడప జిల్లా పులివెందులకు వెళ్తారు. అక్కడ తన
మామ ఈసీ గంగిరెడ్డి మూడో రోజు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత కడప
చేరుకుని మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రత్యేక విమానంలో నేరుగా దిల్లీకి
వెళ్లనున్నారు.
మంగళవారం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వాటాలపై
అపెక్స్ కౌన్సిల్ దిల్లీ నుంచి వీడియో సమావేశం నిర్వహిస్తోంది.
పరిస్థితిని బట్టి ముఖ్యమంత్రి దిల్లీలోనే ఆ సమావేశంలో స్వయంగా
పాల్గొననున్నారు. ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్ సమయాన్ని బట్టి దీనిపై
నిర్ణయం తీసుకోనున్నారు
0 Response to " రేపు దిల్లీకి సీఎం ఎల్లుండి ప్రధానితో సమావేశం"
Post a Comment