ఏపీలో కొత్తగా 6,242 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్
నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 72,811 నమూనాలు
పరీక్షించగా 6,242పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య
7,19,256కు చేరింది. కొత్తగా 40 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య
5,981కి చేరింది.
ఈ మేరకు ఆదివారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్
బులెటిన్ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 7,084 మంది కోవిడ్‌ను
జయించి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 60,94,206 మందికి కరోనా నిర్ధారణ
పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 54,400 యాక్టివ్ కేసులు
ఉన్నాయి.
0 Response to "ఏపీలో కొత్తగా 6,242 కరోనా కేసులు"
Post a Comment