సి.యం, ఉద్యోగుల అంశాల పై భేటి అనుమానమే డిల్లీ కి వెల్ల నున్న సి.యం
ముఖ్యమంత్రి జగన్ దిల్లీ వెళ్తున్నారు. ఉద్యోగులంతా ఆశగా ఎదురుచూస్తున్న మంగళవారం ఆయన దిల్లీలోనే ఉండబోతున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన ఖరారైంది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మంగళవారం ఉదయం 10.30 గంటలకు అపాయింట్ మెంటు కుదిరిందని సమాచారం. ఇందులో తదుపరి ఎలాంటి మార్పు లేకపోతే మంగళవారం ఉదయం వీరిద్దరూ సమావేశమవుతారని చెబుతున్నారు. ప్రధాని అపాయింట్ మెంటు ప్రాథమిక వర్తమానం ఖరారు కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి సోమ, మంగళవారాల్లో ఏపీ రాజధానిలో ఉండటం లేదు. సోమవారం ఉదయమె ఆయన పులివెందుల వెళ్తున్నారు. సాయంత్రం కడప విమానాశయం నుంచి బయలుదేరి దిల్లీ వెళారు. ఆ రోజు ప్రధాన నరేంద్ర మోదీతో
సమావేశం ఖరారు కానుంది. ఆ భేటీ
అనంతరం దిల్లీలోనే మరో కీలక
సమావేశమూ ఉంది. ఏపీ, తెలంగాణల మధ్య
జలవివాదాలకు సంబంధించి రెండు రాష్ర్టాల
ముఖ్యమంత్రులతో కేంద్ర ఇరిగేషన్ మంత్రి
సమావేశమవుతారని చెబుతున్నారు. ఈ భేటీ
సమయం ఇప్పటికే ఖరారైందని తెలిసింది. ఆ
సమావేశంలో కూడా ముఖ్యమంత్రి దిల్లీలోనే
ఉండి పాల్గొంటారని, ఆనక మీడియా
సమావేశమూ నిర్వహించే అవకాశం
ఉందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి
సోమవారం ఉదయం నుంచి మంగళవారం
సాయంత్రం వరకు పులివెందుల, దిల్లీలోనే
ఉండబోతున్నారు . ముఖ్యమంత్రి కార్యాలయ
ఉన్నతాధికారులు సయితం ఆయన వెంట
దిల్లీ వెళ్లే అవకాశం ఉంది
ఉద్యోగుల అంశాలపై అధికారులు , సలహాదారులు మంగళవారం ముఖ్యమంత్రికి ప్రజంటేషన్ ఇవ్వాలని ముందు అనుకున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం సైతం ఇదే విషయం ఉద్యోగ సంఘ నేతలకు వెల్లడించింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం జరిగే అవకాశం తక్కువే... పరిస్థితి అనుకూలిస్తే బుధవారం వీరి సమావేశం జరిగే అవకాశం ఉంది. గురువారం రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఉంది. పెండింగు జీతాల చెల్లింపుపై న్యాయస్థానం ఆదేశాల మేరకు నిర్ణయం అమలు చేయాల్సిన గడువు దగ్గర పదుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల అంశాలు చర్చ అనేది కొంత వాయిదా పడ్డ పూర్తి అంతరాయం ఏర్చడదనేది ఈ అంశాలతో సంబంధం ఉన్న కొందరి అభిప్రాయం.
0 Response to "సి.యం, ఉద్యోగుల అంశాల పై భేటి అనుమానమే డిల్లీ కి వెల్ల నున్న సి.యం"
Post a Comment