వాట్సాప్‌ కొత్త ఫీచర్‌.. ఆ నోటిఫికేషన్స్‌కి చెక్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: వాట్సాప్‌లో ఎన్నో గ్రూపుల్లో సభ్యులుగా ఉంటాం. వాటిలో ఆఫీస్‌, ఫ్రెండ్స్‌, స్కూల్, కాలేజ్‌ ఇలా వివిధ రకాలుంటాయి. అయితే వాటిలో వచ్చే నోటిఫికేషన్స్‌ కొన్ని మనకు విసుగు తెప్పిస్తుంటాయి. అందుకే కొన్ని గ్రూపుల నోటిఫికేషన్స్‌ని మ్యూట్‌ చేస్తాం. అయితే ఈ మ్యూట్ ఆప్షన్‌కి కాల పరిమితి ఉండటంతో కొద్ది గంటలు, వారాలు లేదా ఏడాది తర్వాత మళ్లీ నోటిఫికేషన్ల గోల మొదలవుతుంది. అలా అని గ్రూప్‌లోంచి బయటికి రాలేని పరిస్థితి. అయితే గ్రూప్‌లో సభ్యులుగా ఉంటూనే, నోటిఫికేషన్స్‌ని పూర్తిగా మ్యూట్ చేయగలిగితే.. ఈ ఆలోచన ఎంతో బాగుంది కదా. యూజర్స్‌ కష్టాలను అర్థం చేసుకున్న వాట్సాప్‌ ఇలాంటి ఫీచర్‌తోనే బీటా వెర్షన్‌ను విడుదల చేసింది. త్వరలోనే దీన్ని యూజర్స్‌ అందరికీ అందుబాటులోకి తీసుకురానుందని వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్‌ వాట్సాప్‌ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది

* వా

ట్సాప్‌ 2.20.201.10 (ఆండ్రాయిడ్‌), 2.20.100.23 (ఐఓఎస్‌) బీటా వెర్షన్‌లో ‘అల్వేస్‌ మ్యూట్‌’ ఫీచర్‌తో పాటు స్టోరేజ్‌ యూసేజ్‌ యుఐ, మీడియా గైడ్‌లైన్స్ ఫీచర్స్‌ని కూడా తీసుకొస్తున్నారు. గతంలో ఉన్న ‘వన్‌ ఇయర్‌’ మ్యూట్‌కి బదులుగా అల్వేస్‌ మ్యూట్ ఫీచర్‌ని తీసుకొస్తున్నారు. ఇక మీదట మీరు మ్యూట్‌పై క్లిక్‌ చేస్తే 8 గంటలు, ఒక వారంతో పాటు అల్వేస్‌ మ్యూట్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి.

* ఇక స్టోరేజ్‌ యూసేజ్‌ యుఐ మీ వాట్సాప్‌ మెమొరీని సమర్థంగా ఉపయోగించుకునేందుకు సహాయపడుతుంది. అంటే ఫార్వార్డ్, లార్జ్‌, ఫొటోలు, వీడియోలు, టెక్ట్స్‌ ఫైల్స్‌ ఎంత మెమొరీ ఆక్రమించాయో చూపిస్తుంది. దాని వల్ల మనకు అవసరం లేని ఫైల్స్‌ని సులభంగా డిలీట్ చేయ్యొచ్చు. అయితే పాత వెర్షన్‌లో కాంటాక్ట్‌ లిస్ట్‌ ఆధారంగా ఎంత మెమొరీ ఉపయోగించారనేది చూపిస్తుంది


మీడియా గైడ్‌లైన్స్‌లో ఏదైనా ఫొటో, వీడియో, జిఫ్‌లను ఎడిట్ చేసి దానికి స్టిక్కర్స్‌, టెక్ట్స్‌ యాడ్ చేయ్యొచ్చు. అంతేకాకుండా కొన్ని వెరిఫైడ్‌ బిజినెస్‌ ఖాతాల్లో వాయిస్‌, వీడియో కాలింగ్ బటన్స్‌ను కనిపించడం లేదని వాబీటాఇన్ఫో తెలిపింది. అయితే వాటిని ఎందుకు తొలగించారనే దానిపై వాట్సాప్‌ నుంచి ఎలాంటి సమాచారం లేదు



SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "వాట్సాప్‌ కొత్త ఫీచర్‌.. ఆ నోటిఫికేషన్స్‌కి చెక్‌"

Post a Comment