జేఈఈ టాపర్‌ల మనోగతం
సాఫ్ట్‌వేర్ కంపెనీ పెడతా
తల్లిదండ్రుల ప్రోత్సాహం, టీచర్ల ప్రేరణ వల్ల రోజుకు 13-14 గంటలు కష్టపడి చదివా. అందుకు ఫలితం దక్కింది. మంచి ర్యాంక్ రావడంతో చాలా సంతోషంగా ఉంది. ఐఐటీ-బాంబేలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో చదువుతా. తర్వాత సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టాలన్నది ఆశయం. ఇంటర్‌లో 961 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్స్‌లో 300 మార్కులకుగాను 292 మార్కులు సాధించా. 100 పర్సెంటైల్‌తో ఆలిండియాలో నాలుగో ర్యాంక్(సీఆర్‌ఎల్), ఓబీసీ-ఎన్‌సీఎల్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ దక్కింది. మాది విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణం. తండ్రి ట్రాన్స్‌పోర్టు కంపెనీ నిర్వహిస్తున్నారు.
లందా జితేంద్ర, జేఈఈ మెయిన్స్ ఆలిండియా 4వ ర్యాంకర్
ఐఐటీ-బాంబేలో చేరతా
ఐఐటీ-బాంబేలో సీఎ్‌సఈ బ్రాంచ్ చదువుతా. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఇంటర్‌లో టీచర్ల మార్గదర్శకత్వం వల్ల జేఈఈ మెయిన్స్‌లో ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 5వ ర్యాంక్ (సీఆర్‌ఎల్) లభించింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ దక్కింది. మాది పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీప వీరవాసం గ్రామం. తండ్రి రఘు ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ అడ్మినిస్ట్రేటర్. ఇంటర్ విశాఖపట్నంలోని అసెంట్ జూనియర్ కాలేజీలో చదివా. 955 మార్కులు సాధించా.
- వైఎ్‌సఎస్ నరసింహనాయుడు, ఆలిండియా 5వ ర్యాంకర్
- కంప్యూటర్స్‌లో కొత్త ప్రాజెక్టులు చేస్తా
కంప్యూటర్స్‌లో కొత్త ప్రాజెక్టులు చేయాలన్నది లక్ష్యం. ఐఐటీ-బాంబేలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ చదవాలనుకుంటున్నా. రోజుకు 10 గంటలపాటు చదివా. కుటుంబం ప్రోత్సాహం, కాలేజీ సిబ్బంది కాన్సెఫ్ట్స్ వల్ల జేఈఈ మెయిన్స్‌లో 15వ ర్యాంక్(సీఆర్‌ఎల్) సాధించా. 300 మార్కులకు 292 మార్కులు సాధించా. మాది గుంటూరు జిల్లా బాపట్ల. తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. ఇంటర్‌లో 978 మార్కులు సాధించా.
తడవర్తి విష్ణు శ్రీసాయి శంకర్, ఆలిండియా 15వ ర్యాంకర్
0 Response to "జేఈఈ టాపర్‌ల మనోగతం"
Post a Comment