నిబంధనలకు* *లోబడి
*✨ నిబంధనలకు*
*లోబడి..!*
*✅ 21 నుంచి విద్యార్థులు పాఠశాలలను సందర్శించే అవకాశం*
★ కొవిడ్-19 అన్‌లాక్ 4.0 సడలింపుల నేపథ్యంలో ఈ నెల 21 నుంచి పాఠశాలలను సందర్శించే విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది అనుసరించాల్సిన మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది.
★ 9, 10, ఇంటర్ విద్యార్థులు సహా సిబ్బంది తమ మధ్య ఆరడుగుల భౌతికదూరం తప్పక పాటించాలని పేర్కొంది.
*✅ ప్రధానోపాధ్యాయుల విధులు ఇలా..*
★ పాఠశాల ఆవరణలోని పని ప్రదేశాల్లో అంటే తరగతి గదులు, ప్రయోగశాలలు, అందరూ వినియోగించే ప్రదేశాలతో పాటు తరచూ స్పృశించే ప్రాంతాలను శానిటేషన్ చేయించాలి.
★ విద్యార్థులు కూర్చునే బల్లలు, కుర్చీల మధ్య ఆరడుగుల దూరం ఉండేలా చూడాలి.
★ విద్యార్థులు తమ రాతపుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు, నీళ్ల సీసాలు వంటివి ఇచ్చిపుచ్చుకోకుండా చూడాలి.
*✅ 9,10, ఇంటర్ విద్యార్థులకు సూచనలు*
★ కంటైన్‌మెంట్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల విద్యార్థులు తమ సందేహాల నివృతి కోసం స్వచ్ఛంద ప్రాతిపదికన విద్యాలయాలను సందర్శించవచ్ఛు ఇందుకు తమ తల్లిదండ్రుల నుంచి రాతపూర్వక అనుమతి తప్పక అందజేయాలి.
★ హైటెక్, లోటెక్, నోటెక్ ప్రాంతాల విద్యార్థులందరికీ కొత్త విద్యాసంవత్సరంలో ప్రవేశిస్తున్న సందర్భంలో వారికి ఉపాధ్యాయులు గతేడాది పాఠ్యాంశాల పునఃసమీక్ష చేయాలి.
★ గురుకుల, కేజీబీవీలు, వసతిగృహాల విద్యార్థులు వారి స్వస్థలాలకు దగ్గర్లోని పాఠశాలలను సందర్శించి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్ఛు
★ ఉపాధ్యాయులు వారి కోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేయాలి.
★ బేస్‌లైన్ మూల్యాంకనానికి ప్రథమ్ యాప్ ద్వారా ప్రశ్నపత్రాన్ని అందుబాటులో ఉంచుతారు.
*✅ సగం మంది ఉపాధ్యాయులు*
★ విద్యావారధి కార్యక్రమం అమలులో భాగంగా ఆన్‌లైన్ పాఠ్యాంశాల బోధనకు, విద్యార్థుల సందేహాల నివృత్తికి 50 శాతం మంది ఉపాధ్యాయులు హాజరు కావాల్సి ఉంది.
★ కంటైన్‌మెంట్ జోన్ల పరిధిలోని వారికి మాత్రం అనుమతి లేదు. ఈ మేరకు స్పష్టమైన నిబంధనలు జారీ చేశారు.
★ ప్రతి ఒక్కరూ ముఖాలకు మాస్క్‌లు, లేదా తొడుగులు విధిగా ధరించాలి.
★ కనీసం 40 నుంచి 60 సెకన్లపాటు చేతులను సబ్బుతో తరచూ శుభ్రం చేసుకోవాలి.
★ అవసరం మేరకు శానిటైజర్లను కనీసం 20సెకన్ల పాటు వినియోగించాలి.
★ దగ్గు, జలుబు, ముక్కు కారడం వంటి లక్షణాలు ఉన్న వ్యక్తులు తప్పనిసరిగా టిష్యూ, చేతి రుమాలు వినియోగించాలి. ముంజేతిని అడ్డుగా పెట్టుకోవాలి.
★ కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే ముందుగానే స్వచ్ఛందంగా తెలియజేయాలి.
★ బహిరంగంగా ఉమ్మి వేయడం నిషేధం.
★ ఆరోగ్యసేతు యాప్‌ను అవకాశం ఉన్నచోట డౌన్‌లోడ్ చేసుకుని చరవాణుల్లో నిక్షిప్తం చేసుకోవాలి.
░

0 Response to " నిబంధనలకు* *లోబడి"
Post a Comment