సకాలంలో అమలు కాని వేతన సవరణలు
*🌺రెండు పి.ఆర్.సి ల కాలం ఆలస్యం*
*◙ సకాలంలో అమలు కాని వేతన సవరణలు*
*◙ 11వ వేతన సవరణ కమిషన్ కు మళ్లీ గడువు పెంపు*
*◙ ఉద్యోగుల్లో చర్చోపచర్చలు...*
ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులు 11వ వేతన సవరణ నివేదిక ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే కొద్దీ ఆలస్యమవుతోంది. మరోసారి వేతన సవరణ కమిషన్ గడువు పెంచుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కేవలం మరో 15 రోజులు మాత్రమే గడువు పెంచారు. ఈ లోపు కమిషన్ తన నివేదికను సమర్పిస్తుందా అన్నది సందేహమే. అసలే కరోనా కాలం కావడంతో రాష్ర్ట ఆదాయాలు తగ్గి ఉద్యోగ సంఘాలు సైతం గట్టిగా ఒత్తిడి చేసే పరిస్థితులు లేకుండా పోయాయి. దీంతో ఉద్యోగుల్లో పీఆర్సీల పై ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ ఉద్యమాల వల్ల పీఆర్సీ కమిషన్ల నియామకం జరిగినా వాటి నివేదికల సమర్పణ, అమలు ఆలస్యమవుతూ వస్తోంది.. ఇంతవరకు ఏపీలో 11 కమిషన్లు ఏర్పాటయ్యాయి.
1969లో తొలి వేతన సవరణ సంఘం ఏర్పడింది. వేతన సవరణ పేరిట కరవు భత్యం పే స్కేలులో కలుపుతూ తదనుగుణంగా స్కేళ్లు మారుస్తూ, ఇతర డిమాండ్ల పైనా కమిషన్లు సిఫార్సులు చేస్తున్నాయి. ప్రతి అయిదు సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేయాలనేది సూత్రం. ప్రస్తుతం ఆలస్యమవుతున్నట్లే వివిధ కారణాల వల్ల వేతన సవరణ సంఘాల ఏర్పాటు , నివేదికల అమలు వంటి వాటిలో ఆలస్యం వల్ల ఈ అయిదేళ్ల కాలపరిమితి మారుతూ వస్తోంది. ఒక్కోసారి 8 నుంచి 9 ఏళ్ల ఆలస్యం అయిన సందర్భాలూ ఉన్నాయి. ఇలా ఆలస్యాల వల్ల ఇంతవరకు రెండు పీఆర్సీలు కోల్పోయామని ఉద్యోగుల ఆవేదన చెందుతున్నారు.
పదవీవిరమణ అనంతర ప్రయోజనాలకు నష్టం పీఆర్సీ ఆలస్యం కారణంగా అధిక శాతం ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం ప్రయోజనం పొందలేక పోతున్నారు. ఆర్థికంగా నష్టపోతున్నారు. ఉదాహరణకు పదో పీఆర్సీ 2013 జులై ఒకటి నుంచి అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం 2014 జూన్ 2 నుంచి అమలు చేసింది. 2013 జులై ఒకటి నుంచి 2014 మే 30 వరకు 11 నెలల కాలంలో పదవీవిరమణ చేసిన వారికి పీఆర్సీ అమలు కాలేదు. వారందరికీ 2014 జూన్ రెండు నుంచి ఆర్థిక ప్రయోజనం అమల్లోకి వచ్చింది. ఇలా ప్రతి పీఆర్సీ సమయంలోను పదవీవిరమణ చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టం కలుగుతోంది. 2018 నుంచి అమలు కావాల్సిన 11వ పీఆర్సీ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో చూడాలి.
► *ఇప్పటి వరకు వేతన సవరణ కమిషన్ల ఏర్పాటు, అమలు ఇలా ఉంది*
🌺*1వ పి.ఆర్.సి1969*
◙ అమలు తేది : 19.3.1969
◙ ఆర్థిక లాభం : 1.4.1970 నుంచి
◙ నష్టపోయిన కాలం : 12 నెలలు
🌺*2వ పి.ఆర్.సి 1974*
◙ అమలు తేది: 1.1.1974
◙ ఆర్థిక లాభం : 1.5.1975 నుంచి
◙ నష్టపోయిన కాలం : 16 నెలలు
🌺 *3వ.పి.ఆర్.సి. 1978:*
◙ అమలు తేది: 1.4.1978
◙ ఆర్థిక లాభం : 1.3.1979 నుంచి
◙ నష్టపోయిన కాలం : 11 నెలలు
🌺 *4వ.పిఆర్.సి 1982 రీగ్రూపు స్కేల్స్*
◙ అమలు తేది : 1.12.1982
◙ ఆర్థిక లాభం : 1.12.1982 నుంచి
🌺*5వ పి.ఆర్.సి. 1986:*
◙ అమలు తేది : 1.7.1986
◙ ఆర్థిక లాభం : 1.7.1986 నుంచి
◙ ఫిట్ మెంట్ ప్రయోజనం : 10శాత
🌺 *6వ. పి.ఆర్.సి.1993:*
◙ అమలు తేది: 1.7.1992
◙ ఆర్థిక లాభం : 1.4.1994 నుంచి
◙ నోషనల్ కాలం : 1.7.1992 నుండి 31.3.1994
◙ నష్టపోయిన కాలం : 21 నెలలు
◙ ఫిట్మెంట్ ప్రయోజనం : 10 శాతం
🌺 *7వ. పి.ఆర్.సి. 1999*
◙ అమలు తేది: 1.7.1998
◙ ఆర్థిక లాభం : 1.4.1999
◙ నోషనల్ కాలం: 1.7.1998 నుండి 31.3.1999
◙ నష్టపోయిన కాలం: 9 నెలలు
◙ ఫిట్మెంట్ ప్రయోజనం: 25శాతం
🌺 *8వ. పి.ఆర్.సి 2005*
◙ అమలు తేది: 1.7.2003
◙ ఆర్థిక లాభం: 1.4.2005
◙ నోషనల్ కాలం: 1.7.2003 నుండి 31.3.2005
◙ నష్టపోయిన కాలం: 21 నెలలు
◙ ఫిట్మెంట్ ప్రయోజనం: 16శాతం
🌺 *9వ.పి.ఆర్.సి. 2010*
◙ అమలు తేది: 1.7.2008
◙ ఆర్థిక లాభం: 1.2.2010 నోషనల్ కాలం: 1.7.2008 నుండి 31.1.2010
◙ నష్టపోయిన కాలం: 19 నెలలు
◙ ఫిట్మెంట్: 39 %
◙ EHS(పూర్తిస్థాయి ప్రయోజనం చేకూరని ఉద్యోగుల ఆరోగ్య కార్డులు)
🌺 *10వ. పి.ఆర్.సి 2015:*
◙ అమలు తేది : 1.7.2013
◙ ఆర్థిక లాభం: 2.6.2014
◙ నోషనల్ కాలం : 1.7.2013 నుండి 1.6.2014
◙ నష్టపోయిన కాలం: 11 నెలలు, ఫిట్మెంట్ : 43 %
◙ వయోపరిమితి (పదవీ విరమణకు) 60సం.కు పెంపు
🌺 *11వ.పి.ఆర్.సి. 2020:*
◙ కమిటీ ఏర్పాటు : 28.5.2018
◙ గడచిన కాలం : 2సం.2నెలలు
◙ ప్రస్తుత పరిస్థితి- నివేదిక రావాల్సి ఉంది. మళ్లీ కమిషన్ గడువు పెంపు.
0 Response to "సకాలంలో అమలు కాని వేతన సవరణలు"
Post a Comment