రిమోట్‌ ఓటింగ్‌పై ఈసీ కసరత్తు

నలుగురు సభ్యుల సాంకేతిక బృందం అధ్యయనం


న్యూఢిల్లీ, సెప్టెంబరు 12: దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొనేందుకు వీలు కల్పించే ‘రిమోట్‌ ఓటింగ్‌’ వ్యవస్థపై ఎన్నికల సంఘం దృష్టిపెట్టింది. ఇంతవరకూ ఈ ఓటర్లు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా మాత్రమే ఓటు వేయగలుగుతున్నారు. దీనితో పాటు ఆధునిక సాంకేతిక విధానంలో కూడా ఓటు చేసే అవకాశం, 



సాధ్యాసాధ్యాలపైపై పరిశీలనకు ఈసీ నలుగురు సభ్యుల సాం కేతిక సలహా బృందాన్ని ఏర్పాటు చేసింది. వీరు ఐఐటీ భిలాయ్‌, ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్‌, నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌కు చెందిన నిపుణులు. బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ సహా వివిధ సాంకేతిక విధానాల ద్వారా వర్చువల్‌ ఓటింగ్‌ వ్యవస్థ ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు ఐఐటీ భిలాయ్‌ డైరెక్టర్‌ రజత్‌ మూనా చెప్పారు.  

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "రిమోట్‌ ఓటింగ్‌పై ఈసీ కసరత్తు"

Post a Comment