జేఈఈ కటాఫ్ మార్కుల విడుదల
న్యూఢిల్లీ, సెప్టెంబరు 12: ఎన్‌ఐటీ,
ఐఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ మార్కుల ఆధారంగా
అడ్వాన్స్‌డ్‌కు కటా్‌ఫను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శనివారం
విడుదల చేసింది. కామన్ ర్యాంకు కటాఫ్ 90.3765335 కాగా,
ఈడబ్ల్యూఎస్
కటా్‌ఫను 70.2435518గా నిర్ధారించింది. అలాగే వెనుకబడిన తరగతుల కటాఫ్
మార్కులు 72.8887969. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కటాఫ్ మార్కులు వరుసగా
50.1760245, 39.0696101, 0.0618524గా ఎన్టీఏ ప్రకటించింది.
జేఈఈ మెయిన్‌లో
అర్హత సాధించిన టాప్ 2,50,000 మందిని ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అనుమతిస్తారు.
0 Response to "జేఈఈ కటాఫ్ మార్కుల విడుదల"
Post a Comment