వెబ్‌సైట్‌లో ఐసెట్‌ హాల్‌టికెట్లు

అమరావతి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): ఏపీ ఐసెట్‌-2020 హాల్‌టికెట్లను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి గురువారం విడుదల చేసింది. 2020-21 విద్యా సంవత్సరంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్ల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ టఛిజ్ఛి.్చఞ.జౌఠి.జీుఽ/జీఛ్ఛ్టి  నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఉన్నత విద్యా మండలి సూచించింది.





CLICK HERE TO OFFICIAL WEBSITE

ఏపీలో 74, హైదరాబాద్‌లో 3 (మొత్తం 77) పరీక్ష కేంద్రాలను కేటాయించారు. ఈ నెల 10-11 తేదీల్లో కంప్యూటర్‌ ఆధారితంగా ఐసెట్‌ నిర్వహిస్తారు. కొవిడ్‌-19 మార్గదర్శకాలను అనుసరించే ఆన్‌లైన్‌ పరీక్షలు జరుగుతాయని ఉన్నత విద్యామండలి స్పెషల్‌ ఆఫీసర్‌(సెట్స్‌) సుధీర్‌రెడ్డి తెలిపారు. అన్ని సెట్స్‌కు దరఖాస్తులకు ఈ నెల 5వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "వెబ్‌సైట్‌లో ఐసెట్‌ హాల్‌టికెట్లు"

Post a Comment