ఏపీలో కరోనా..8,835 కొత్త కేసులు
అమరావతి:
ఏపీలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 75,013 నమూనాలను
పరీక్షించగా 8,835 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజా
కేసులతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 5,92,760కి చేరింది. ఈ మేరకు
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో
10,845 మంది కోలుకోగా.. 64 మంది మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో 9 మంది,
నెల్లూరు 7,
గుంటూరు 6, ప్రకాశం 6, అనంతపురం 5, కడప 5, కృష్ణా 4,
తూర్పుగోదావరి 3, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున
మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి
సంఖ్య 5,105కి చేరింది. ప్రస్తుతం 90,279 యాక్టివ్ కేసులు ఉన్నట్లు
బులెటిన్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 48,06,879
నమూనాలను పరీక్షించారు
0 Response to "ఏపీలో కరోనా..8,835 కొత్త కేసులు"
Post a Comment