ఏపీలో కొత్తగా 6,190 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 68,429 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా
6,190 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం
కేసుల సంఖ్య 6,87351కి చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్
బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 9,836 మంది
క్షేమంగా డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు 6,22,136 మంది డిశ్చార్జ్
అయ్యారు. గత 24 గంటల్లో ప్రకాశంలో ఎనిమిది, చిత్తూరులో ఆరుగురు, అనంతపురంలో
నలుగురు,
తూర్పుగోదావరిలో నలుగురు, గుంటూరులో నలుగురు, విశాఖపట్నంలో
ముగ్గురు.. నెల్లూరు, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు చొప్పున
కరోనా బారిన పడి మొత్తం 35 మంది మరణించారు. దీంతో కరోనా సోకి మరణించిన వారి
సంఖ్య 5780కి చేరింది. ఏపీలో ప్రస్తుతం 59,435 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇప్పటివరకు రాష్ట్రంలో రికార్డుస్థాయిలో 57,34,752 మందికి కరోనా పరీక్షలు
నిర్వహించారు.

0 Response to "ఏపీలో కొత్తగా 6,190 కరోనా కేసులు"
Post a Comment